వైఎస్ వివేకా హత్యపై పార్లమెంటులో?

వైఎస్ వివేకా హత్యకు నలభై కోట్ల సుపారీ విషయాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.

Update: 2021-11-27 13:20 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నలభై కోట్ల సుపారీ విషయాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఆయన వర్చువల్ గా టీడీపీ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. నలుగురు ఎంపీలతో ఆయన మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నలభై కోట్ల సుపారీ ఇచ్చారని, అడ్వాన్స్ గా కోటి రూపాయలు చెల్లించినట్లు దస్తగిరి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగేలా డిమాండ్ చేయాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు.

జాతీయ విపత్తుగా....
అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించేలా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే మూడు రాజధానుల బిల్లు వెనక్క తీసుకోవడం, ప్రత్యేక హోదా, పంచాయతీ నిధుల దారి మళ్లింపు, ఉపాధి హామీ నిధులను చెల్లించకపోవడంపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు.


Tags:    

Similar News