హోదా అంశం తొలగించడంపై బాబు రెస్పాన్స్ ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై నీ స్టాండ్ ఏంటని ఆయన ప్రశ్నించారు.

Update: 2022-02-14 13:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై నీ స్టాండ్ ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. ప్రత్యేక హోదాపై యుద్ధాన్ని జగన్ ముగించినట్లుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజీనామాలపై నాటి నీ సవాళ్లు ఏమయ్యాయని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీకి చేతకాదు....
అజెండాలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తమ ఘనత అని చెప్పుకున్న వైసీపీ నేతలు తమపై తర్వాత బురద జల్లుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గకపోయినా ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి కూర్చున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. లేని సమస్యలను సృష్టించి చివరకు టాలీవుడ్ హీరోలను ఇంటికి పిలిపించుకుని అవమానపర్చారని చంద్రబాబు మండి పడ్డారు. మోటార్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News