జగన్ కు సర్పంచ్ కు ఉన్న పరిజ్ఞానం కూడా లేదు

సర్పంచ్ కు ఉన్న పరిజ్ఞానం కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు

Update: 2022-02-17 12:56 GMT

సర్పంచ్ కు ఉన్న పరిజ్ఞానం కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సర్పంచ్ లకు ఉన్న రాజ్యాంగ హక్కులను కూడా జగన్ కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. సర్పంచ్ లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఫైర్ అయ్యారు. సర్పంచ్ లు తమ హక్కుల కోసం చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందని చంద్రబాబు చెప్పారు. గ్రామాలను వైసీపీ ప్రభుత్వంలో నాశనం చేసిందన్నారు. గౌతం సవాంగ్ ను అకస్మాత్తుగా తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఇచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

అరాచకాలు చేసి.....
ఉగ్రవాదులను మించిన పాలన వైసీపీ అందిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ అరాచకాలు చేసిందని చెప్పారు. ప్రత్యర్థులను ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అయినా టీడీపీ నుంచి తెగించి బరిలోకి దిగి గెలిచారని చంద్రబాబు గుర్తు చేశారు.


Tags:    

Similar News