వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం

వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2025-04-15 07:38 GMT

వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉదయ్‌కుమార్‌ బెయిల్ రద్దు చేయాలని సునీత పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టువివేకా హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ పాత్ర ఏమిటని చీఫ్ జస్టిస్ సంజీవ్‌ఖన్నా ప్రశ్నించారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినవారిలో ఉదయ్‌కుమార్‌ ఒకరని సునీత తరపు న్యాయవాదులు తెలిపారు.

నోటీసులు జారీ చేసి...
దీంతో ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో దాఖలైన బెయిల్ రద్దు పిటిషన్లతో ఈ పిటిషన్‌ జతచేసి విచారిస్తామన్న సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నోటీసులకు సమాధానం వచ్చిన తర్వాత వారినుంచి వాదనలు విన్న తర్వాత సుప్రీం నిర్ణయాన్ని వెలువరించనుంది.


Tags:    

Similar News