Andhra Pradesh : వైసీపీ మాజీ మంత్రి ఇంటికి సిట్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుత్తూరులోని ఆయన నివాసంలో ఆయనను విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని నారాయణ స్వామిని ఆదేశించినా ఆయన రాలేకపోవడంతో నేరుగా ఆయన ఇంటికి వచ్చి విచారణ చేస్తున్నారు.
నాటి మద్యం విధానంలో...
ఈ కేసులో నారాయణ స్వామి భాగస్వామ్యంపై ఆరాతీస్తున్నారు. ఎవరి వత్తిడి మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా నూతన మద్యం పాలసీపై సంతకం చేశామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ కేసులో మార్పులు జరగడానికి కారకులపై ఆరా తీసేందుకు సిట్ అధికారులు నారాయణ స్వామి ఇంటికి వచ్చారు. ఎవరి పాత్ర ఏంటో తేల్చేందుకు వారు వచ్చారు.