టీడీపీ సీనియర్ నేత మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గారపాటి సాంబశివరావు మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గారపాటి సాంబశివరావు మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు మండలం నాయుడు గూడెంలో ఆయన మరణించారు. ఆయన మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.....
గారపాటి సాంబశివరావు టీడీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. సాంబశివరావు మృతి పట్ల పార్టీల కతీతంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.