నేడు సుప్రీంకోర్టులో విచారణ

నేడు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు విచారణ జరగనుంది

Update: 2025-12-15 03:24 GMT

నేడు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్‌ పిటిషన్లపై సుప్రీం విచారించనుంది. ఏసీబీ కోర్టు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురికి బెయిల్ లభించింది. అయితే ఈ ముగ్గురు బెయిల్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

బెయిల్ రద్దుపై...
దీంతో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ఈ కేసులో బెయిల్ కొనసాగించాలని కోరుతున్నారు. మరొకవైపు వీరు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించనున్నారు. వీరి బెయిల్ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయవద్దని కోరనున్నారు.


Tags:    

Similar News