Chandrababu : ఆదాయార్జన శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం పదకొండు గంటలకు తెలంగాణలోని కన్హా శాంతివన ఆశ్రమాన్ని సందర్శిస్తారు.మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు.
ఆర్థిక శాఖపై కూడా...
మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్థిక శాఖపై సమీక్షను చంద్రబాబు నాయుడు చేస్తారు. సాయంత్రం 4.00 గంటలకు ఆర్టీజీఎస్‌లో పథకాల అమలుతీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నాుు. 6.30 గంటలకు పొట్టి శ్రీరాములు ఆత్మార్పన దినం కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.