YSRRCP : నేడు జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను నిర్వహించనుంది
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను నిర్వహించనుంది. జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కకేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను తీసుకు రానునన్ారు. అక్టోబరు 10వ తేదీన ప్రారంభించి రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి కోటి సంతకాలను పార్టీ సేకరించింది.
కోటి సంతకాలను...
సేకరించిన సంతకాలను ఈ నెల 18వ తేదీన గవర్నర్ కు ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని తెలియజేయనున్నారు. ప్రభుత్వ కళాశాలలను ప్రయివేటు పరం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ గవర్నర్ ను కోరనున్నారు. ఇందులో భాగంగా నేడు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను పార్టీ నిర్వహించనుంది.