Nara Lokesh : నేడు ఢిల్లీలో లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు ఢిల్లీలో నారా లోకేశ్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా నారా లోకేశ్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కీలక అంశాలపై లోకేశ్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులతో భేటీ అయి...
మంత్రి నారా లోకేశ్ నేటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్ లను కూడా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ అంశాలపై లోకేశ్ చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత తెచ్చే విషయంపై హోం మంత్రి అమిత్ షాను కలిసి చర్చించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొందరి కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లభించింది.