ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కొనసాగుతుంది.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కొనసాగుతుంది. ఇంద్రకీలాద్రికి లక్షలాదిగా భవానీ మాలలు వేసుకున్న భక్తులు తరలి వస్తున్నారు. భవానీల దుర్మమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. గిరి ప్రదక్షణ చేసి మాల విరమణ చేస్తున్న భవానీలకు ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది.
అంతరాలయ దర్శనం రద్దు...
దర్శనానికి మూడు నుంచి నాలుగుగంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భవానీల కోసం కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టిన అధికారులు వారు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రేపటితో భవానీ దీక్షల విరమణ ముగియనుండటంతో రేపటి వరకూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు.