జగన్ విజన్ అదే.. కానీ ఈ ప్రభుత్వంలో పెద్ద స్కామ్
మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నడపటం పేదలకు అవసరమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నడపటం పేదలకు అవసరమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ విజన్ తోనే పదిహేడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్లాన్ చేశారని సజ్జల చెప్పారు. ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి అడ్మిషన్లను కూడా పూర్తి చేశామని చెప్పారు. ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి చేసే సమయంలో ఈలోపు ఎన్నికలు వచ్చాయని తెలిపారు. వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి కృషి చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మెడికల్ హబ్ ను క్రియేట్ చేద్దామని అనుకున్నారని తెలిపారు.
వైద్య రంగంలో...
ఆరోజు ఇన్ని ఒక్కసారిగా ప్రారంభించడం వెనక ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తే పేదలకు మెరుగైన, నాణ్యత కలిగిన వైద్యం లభిస్తుందని జగన్ భావించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారని సజ్జల అన్నారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 1.40 కోట్ల సంతకాలు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం తెస్తుంది.. పీపీపీ కాదని పెద్ద స్కామ్ అని సజ్జల అభిప్రాయపడ్డారు.