జగన్ అమరావతి వ్యాఖ్యలకు సజ్జల ఇలా కవర్ చేశారుగా

అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

Update: 2026-01-10 07:52 GMT

అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారని అన్నారు. లక్ష చదరపు అడుగుల కార్యాలయాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలకు చంద్రబాబు నుంచి సమాధానం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నీళ్లు తోడటమే సరిపోయిందని, కంపచెట్లను కొట్టడానికే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతులకు ఇస్తున్న రిటర్న్ బుల్ ఫ్లాట్స్ ను ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలు సంధించారని అన్నారు. రాజధానిఏదైనా గ్రాడ్యుయల్ గా డెవలెప్ కావాల్సిందేనని అన్నారు.

యాభై వేల ఎకరాలు అభివృద్ధి చేయాలంటే...
యాభై వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి, ఏడాదికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలని, ఎక్కడి నుంచి తెస్తారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు తన ఇంటికోసం గజం 7,500 రూపాయలకు స్థలాన్ని కొన్నారని, అంటే ఎకరం నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఉందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం సాధ్యం కాదనే జగన్ అన్నారని, అంతే తప్ప జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపారని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.














Tags:    

Similar News