శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2026-02-09 04:06 GMT

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెనుకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి సవిత పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

బస్సును ఢీకొట్టిన లారీ...
మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సవిత ఆదేశించారు. బస్సును ఢీకొట్టిన తర్వాత ఆపకుండా లారీ వెళ్లింది. పరారైన లారీ డ్రైవర్ కోసం పోలీసుల గాలిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు డ్రైవర్ కోసం వెదుకులాటను ప్రారంభించారు. కేసు నమోదుచేసిన పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News