Narendra Modi : అక్టోబరు 16న మోదీ ఏపీకి రాక
ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నరేంద్ర మోదీ తొలుత అక్టోబరు 16న రాష్ట్రానికి వచ్చి శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కూటమి నేతలతో కలసి కర్నూలులో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
కర్నూలులో రోడ్ షో...
కర్నూలు జిల్లాలో జీఎస్టీ సంస్కరణలను చేపట్టిన తర్వాత దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో జరిగే రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు పాల్గొననున్నారు. తర్వాత కూటమి నేతలతో ఆయన సమావేశమవుతారని తెలిసింది.