మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాల్సిందే
మంత్రి అప్పలరాజు పై పోలీసు అధికారుల సంఘం మండిపడింది. వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
మంత్రి అప్పలరాజు పై పోలీసు అధికారుల సంఘం మండిపడింది. వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనలో సీఐతో వాగ్వాదానికి దిగిన మంత్రి అప్పలరాజు పై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. శారదా పీఠానికి తన అనుచరులతో వచ్చిన మంత్రి అప్పలరాజును విధి నిర్వహణలో ఉన్న సీఐ అడ్డుకున్నారు. మంత్రికి మాత్రం లోపలికి అనుమతి ఉందని, ఇతరులకు అనుమతి లేదని చెప్పారు.
వైసీపీ కూడా....
దీంతో మంత్రి అప్పలరాజుతో పాటు ఆయన అనుచరులు సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయాలని పోలీసు అధికారుల సంఘం కోరింది. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు కోరారు. మంత్రి అప్పలరాజుపై వైసీపీ లో కూడా అసహనం వ్యక్తమవుతుంది. రచ్చ చేసి ముఖ్యమంత్రి జగన్ అసలు కార్యక్రమాన్ని మంత్రి అప్పలరాజు పక్కదోవ పట్టించారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.