Janasena : ఆ ఎంపీని పవన్ దూరం పెట్టడానికి అసలు కారణమదేనా?

కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ కల్యాణ్ దూరం పెట్టినట్లు కనిపిస్తుంది

Update: 2026-02-06 08:00 GMT

కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ కల్యాణ్ దూరం పెట్టినట్లు కనిపిస్తుంది. ఆయన పై వస్తున్న ఫిర్యాదులతో పాటు పార్టీ నేతలతోనే సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో పాటు కొందరు టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటాన్ని కూడా పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఉదయ్ శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారంటున్నారు. సంక్రాంతికి ముందు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినా అక్కడ ఉదయ్ శ్రీనివాస్ కనిపించకపోవడం ఇటువంటి సందేహాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పార్టీ బలోపేతానికి కూడా పాటు పడటం లేదన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

వారాహి వాహనం ఇచ్చి...
ఉదయ్ శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కు 2024 ఎననికలకు ముందు చేరువయ్యారు. నవన్ కల్యాణ‌్‌కు వీరాభిమాని కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు. వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆ వాహనంతోనే పవన్ ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతుంటారు. ఆయనకు తొలుత పిఠాపురం టిక్కెట్ ఇవ్వాలని భావించినా అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఉదయ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం రెండు పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేసింది. ఉదయ్ శ్రీనివాస్ కూటమి హవాలో గెలుపొందారు.
టీ టైం అధినేతగా...
ఉదయ్ కు పవన్ అంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది జనసైనికులకు చెప్పకనే తెలుస్తుంది. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కడియం. ఆయన పదో తరగతి కడియంలోనే చదివారు.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. తర్వాత దుబాయ్ లో కొంతకాలం వరకూ పనిచేసి బాగానే సంపాదించారు. నాలుగు డబ్బులు రావడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై విరక్తి చెందడంతో ఆయన 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన భావించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఉదయ్ సొంతంగా 2016లో టీ టైం పేరుతో అవుట్‌లెట్ ను ఉదయ్ ప్రారంభించాడు. ఇండియా మొత్తం మూడు వేలకకు పైగా అవుట్ లెట్ ను ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించగలిగారు. నెలకు 35 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్థాయికి ఎదిగారు.
పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత...
అయితే జనసేనలో చేరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మాత్రం ఉదయ్ శ్రీనివాస్ లో చాలా మార్పు వచ్చిందంటున్నారు. పదవుల విషయంలోనూ పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే సొంత పార్టీ నేతలే ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలుత పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం బాధ్యతలను అప్పగించినా తర్వాత ఆయనను తప్పించారు. తర్వాత ఫైవ మెన్ కమిటీలో ఆయనను సభ్యుడిగా మాత్రమే ఉంచారు. నేతలతో సయోధ్యను సాధించడంలో ఉదయ్ విఫలమయ్యారంటున్నారు. తాజాగా ఆయనను కొంత దూరం పెట్టడం వెనక కూడా ఉదయ్ శ్రీనివాస్ పార్టీ నిర్ణయాలను కాదని వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందునే కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో పవన్ కల్యాణ్ వెంట ఉదయ్ శ్రీనివాస్ ఉన్నప్పటికీ పట్టీ పట్టనట్లు పవన్ వ్యవహరించారంటున్నారు.


Tags:    

Similar News