బొజ్జలపై సీరియస్ అయిన బాబు

శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2022-02-24 04:13 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పని చేయని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే పార్టీకి అవసరం లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు, క్యాడర్ కు అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫిర్యాదు చేయడంతో....
చంద్రబాబు శ్రీకాళహస్తి నేతలతో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అయితే స్థానిక నేతల బొజ్జల సుధీర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తమకు అందుబాటులో ఉండటం లేదని అధిక సంఖ్యలో నేతలు చెప్పడంతో బొజ్జల సుధీర్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇకనైనా అందుబాటులో ఉండాలని, లేకుంటే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.


Tags:    

Similar News