విజయసాయి రెడ్డి కుమార్తె భవనాల కూల్చివేత
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన భవనాల ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు.
officials are demolishing encroached buildings of nehareddy
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన భవనాల ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలీలో ఆక్రమిత స్థలంలో అక్రమంగా నిర్మాణాలను నేహారెడ్డి చేపట్టారన్న ఆరోపణలున్నాయి. గతంలోనూ కొన్ని ఆక్రమణలను విశాఖ మున్సిపల్ అధికారులు తొలగించారు.
ఈరోజు ఉదయం నుంచి...
అయితే నేటి ఉదయం నుంచి కూడా ఆక్రమిత ప్రాంతంలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో నేహారెడ్డికి చెందిన స్థలంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా నేహారెడ్డి భీమిలీలో అక్రమంగా నిర్మాణాలను చేపట్టారని అధికారులు చెబుతున్నారు.