Andhra Pradesh : కర్నూలుకు చేరుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు చేరుకున్నారు.

Update: 2025-10-16 04:41 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్ లో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలానికి వెళ్లనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. సుమారు యాభై నిమిషాల పాటు ఆలయంలో నరేంద్ర మోదీ గడపనున్నారు.

హెలికాప్టర్ లో బయలుదేరి...
అనంతరం భ్రమరాంబ అతిధి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం శివాజీ కేంద్రంలో కొద్దిసేపు గడుపుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరి తిరిగి కర్నూలుకు చేరుకుంటారు. నన్నూరులో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. జీఎస్టీ సంస్కరణల పై ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.


Tags:    

Similar News