వైఎస్సార్ షాదీ తోఫా వారికీ వర్తిస్తుంది

వైఎస్సార్ షాదీ తోఫా దూదేకుల వారికి కూడా వర్తిస్తుందని మైనారిటీ వెల్‌ఫేర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది

Update: 2022-11-07 12:44 GMT

cm jagan

వైఎస్సార్ షాదీ తోఫా దూదేకుల వారికి కూడా వర్తిస్తుందని మైనారిటీ వెల్‌ఫేర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ షాదీ తోఫా దూదేకుల వారికి వర్తించదని కొందరు తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రత్యేకంగా....
దూదేకుల మెహతర్ ముస్లిం లకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. దూదేకుల పొలిటికల్ జేఏసీ విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మెహతర్ ముస్లింలకు కూడా లక్ష రూపాయలు షాదీ తోఫా కింద ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


Tags:    

Similar News