టీడీపీపై చెల్లుబోయిన ఫైర్

తెలుగుదేశం పార్టీకి బీసీలు దూరమయ్యారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు

Update: 2022-10-27 08:48 GMT

తెలుగుదేశం పార్టీకి బీసీలు దూరమయ్యారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. దీంతో టీడీపీలో వణుకు మొదలయిందని ఆయన తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు జగన్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు. టీడీపీ నేతలు బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రిజర్వేషన్నలను నిర్వీర్యం చేసిందెవరని మంత్రి వేణుగోపాల్ ప్రశ్నించారు. 2018 ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే రిజర్వేషన్లు అమలయ్యేవి అని ఆయన అన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీడీపీ పదే పదే అబద్ధాలు చెప్పినా ఎవరూ నమ్మరని మంత్రి చెల్లుబోయిన అన్నారు. మూడున్నరేళ్లలో బీసీల సంక్షేమం కోసం 832,373 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు.

సామాజిక న్యాయం...
జగన్ పాలనలో సామాజిక న్యాయం అమలవుతుందని ఆయన తెలిపారు. బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించామని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఏమేరకు బీసీలకు న్యాయం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జగన్ బీసీలకు నామినేటెడ్ పదవులు కల్పించి వారికి రాజకీయంగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మూడున్నరేళ్లలో బీసీలకు 82 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన తెలిపారు. టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా అబద్దపు ప్రచారం చేస్తే బీసీలు నమ్మరని చెల్లుబోయిన అన్నారు.


Tags:    

Similar News