మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడు రాజధానులను అడ్డుకుంటున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు.
తెలుగుదేశం పార్ట అధినేత చంద్రబాబు మూడు రాజధానులను అడ్డుకుంటున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు. అది అమరావతి కాదు కమ్మరావతి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉండి చంద్రబాబు ప్రతి పనినీ అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆరోపించారు. కోర్టులకు కెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
అది కమ్మరావతి.....
సీఆర్డీఏ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసిందని, తమ విధానం మాత్రం అధికార వికేంద్రీకరణేనని అప్పలరాజు తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై ముందుకు వెళతామని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుకు బుద్ది చెప్పాలని అప్పలరాజు కోరారు.