ఏపీలో భారీ వర్షాలు.. రైతుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2022-12-02 06:34 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏడోతేదీన వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వరి కోతల సమయం....
ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి కోతల సమయం కావడంతో వర్షాల కారణంగా పంట దెబ్బతినే అవకాశాలున్నాయని వారు భయపడిపోతున్నారు. ఫిబ్రవరి నెల వరకూ చలి ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News