గుడివాడ ఏఎన్నార్ కళశాలకు నాగార్జున రెండు కోట్లు

అక్కినేని నాగార్జున గుడివాడ ఏఎన్నార్ కళాశాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

Update: 2025-12-17 06:37 GMT

అక్కినేని నాగార్జున గుడివాడ ఏఎన్నార్ కళాశాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా ఆయన పేరిట స్థాపించిన గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కళాశాలలోని రూసా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.

1959లోనే...
ఈ కళాశాలకు 1959లోనే తన తండ్రి నాగేశ్వరరావు లక్ష రూపాయల విరాళం ఇచ్చారని నాగార్జున గుర్తు చేశారు. అయితే వజ్రోత్సవాల సందర్భంగా ఏఎన్నార్ కళాశాలలోని విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం తమ కుటుంబం రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరాళంతో విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించాలని కోరారు.


Tags:    

Similar News