రాజకీయాల్లోకి రావట్లేదు: నారా బ్రాహ్మణి

రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్‌ సతీమణి

Update: 2025-12-16 15:10 GMT

రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్‌ సతీమణి, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈడీ నారా బ్రాహ్మణి చెప్పారు. తన తొలి ప్రాధాన్యత హెరిటేజ్‌ ఫుడ్స్‌ కే అంటూ స్పష్టం చేశారు. ఆ సంస్థ ద్వారా గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి గానూ బిజినెస్‌ టుడే సంస్థ ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారని అడిగిన ప్రశ్నకు బ్రాహ్మణి బదులిచ్చారు. కచ్చితంగా అది తనకు ఆసక్తికరమైన రంగం కాదని, పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఆరోగ్యం, పోషణ రంగాలపై ఎంతో ఆసక్తి ఉందని తెలిపారు.

Tags:    

Similar News