టీటీడీని చంద్రబాబు మోసం చేస్తున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మూడు కోట్ల భూమిని చంద్రబాబు ఒబెరాయ్ స్టార్ హోటల్ కు లీజుకు ఇచ్చారని అన్నారు. లీజు మొత్తంతో పాటు అనేక రాయితీలను ప్రకటించారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇది పరకామణి కంటే ఘోరమైన అపచారమనిభూమన పేర్కొన్నారు.
ఎర్రచందనం చెట్లను...
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం చెట్లను అక్రమంగా తరలిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తిరుమల భక్తులను నిలువునా మోసం చేస్తుంది చంద్రబాబు మాత్రమేనని, తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై పీఠాధిపతులు, మఠాధిపతులు స్పందించాలన్నారు. జీవో ఇవ్వకుండానే ఎర్ర చందనం మాయం చేశారన్నారు.