Chandrababu : జగన్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చిట్ చాట్ లో మాట్లాడుతూ జగన్ కు కోర్టులంటే లెక్కలేదని అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరు కావడం లేదని అన్నారు. కోర్టు కూడా తప్పుపట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చంద్రబాబు అన్నారు. పీపీపీ విధానమంటే ప్రభుత్వ పెత్తనమే ఉంటుందని, ప్రయివేటు వ్యక్తులు వాటిని నడుపుతారని అన్నారు.
ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని...
దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని తెలిసినా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని జగన్ చూస్తున్నారని అన్నారు. మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాలంటే పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కళాశాలలను నిర్వహించడం బాగుంటుందని చెప్పారు. పీపీపీ విధానం ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ మోడల్ అని అన్న చంద్రబాబు పరకామణి చోరీ కేసు జగన్ కు చిన్న విషయంగా కనిపించిందని ఎద్దేవా చేశారు.