Chandrababu : జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు. జనవరి నెల నుంచి తాను జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో అన్ని విభాగాలను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలు పంపిణీ దగ్గర నుంచి వాటిని అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తానని తెలిపారు. అలాగే జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలను కూడా తాను జిల్లాల పర్యటనలో చూస్తానని చెప్పారు.
సచివాలయాల పేర్లను...
మరొకవైపు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇకపై వాటిని స్వర్ణ గ్రామంగా పిలవాలని కలెక్టర్ల సమాేవశంలో సూచించారు. ప్రజా ఫిర్యాదుల విషయంలోకలెక్టర్లు వేగంగా స్పందించాలని సూచించారు. తాను ఆకస్మిక తనిఖాలకు వచ్చిన సందర్భంలో ఎటువంటి ఫిర్యాదులు పెండింగ్ లో ఉండకూడదని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఫైళ్ల క్లియరెన్స్ ను కూడా వేగంగా చేయాలని, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు.