నేడు అమిత్ షాతో బీజేపీ నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ లు నేడు అమిత్ షాను కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ లు నేడు అమిత్ షాను కలవనున్నారు. ఇద్దరూ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నాు. ఉదయం పదకొండు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇద్దరూ భేటీ కానున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలతో పాటు ధర్మవరం నుంచి అమరావతి వరకూ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
వాజపేయి శతజయంతి ఉత్సవాలకు...
ఈ నెల 25వ తేదీన అమరావతిలో జరిగే వాజ్ పేయి శతజయంతి సభకు అమిత్ షాను ఆహ్వానించడానికి వీరు వెళ్లనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు కూడా పాల్గొననున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో చర్చించే అవకాశాలున్నాయి. మెడికల్ కళాశాలల ఆందోళనపై చర్చకు వచ్చే అవకాశముంది.