నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే అదనంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు 8 గంటల నుండి 12న సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే శివదీక్ష ఇరుముడి కలిగిన స్వాములకు మాత్రమే శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం విడతల వారీగా ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు నలభై లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామన్నారు. క్షేత్రంలో పలుచోట్ల వాహనాల పార్కింగ్ సేద తీరేందుకు జర్మన్ షెడ్లు, పార్కింగ్ లో మంచినీరు, మరుగుదొడ్లు, లైటింగ్ అందుబాటులో ఉంచారు. పోయిన ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 13 నుండి 16 వరకు నాలుగు రోజులు భక్తులకు ఉచిత లడ్డు అలాగే 15, 16 రెండు రోజులు వాహనాలు టోల్ గేట్లు లేకుండా ఉచితంగా అనుమతించనున్నారు.