Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త ప్రాజెక్టు మంజూరు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా పోర్టుల నుంచి జాతీయ రహదారులకు కనెక్టివిటీ పెంచి తద్వారా ఎగుమతులు, దిగుమతుల సరుకు రవాణా సలువు అవుతుంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి కాకముందే ఈ గుడ్ న్యూస్ ను కేంద్ర ప్రభుత్వం అందించంది. దీనికి సంబంధించిన నిధులను కూడా మంజూరు చేసింది. మచిలీపట్నం పోర్టు కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోవడానికి ఈ రహదారి ఎంతో ఉపయోగపడునుంది.
జాతీయ రహదారికి...
మచిలీపట్నం నుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఇందుకోసం మచిలీ పట్నం నుంచి ఆరు లేన్ల రహదారిని కేంద్ర ప్రభుత్వం తన నిధులతో నిర్మంచనుంది. దీంతో మచిలీపట్నం రూపు రేఖలు మారనున్నాయి. దీంతో పాటు సరుకు సరఫరాలోనూ వేగం మరింత పెరుగుతుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే ఈ ఆరు లేన్ల రహదారి మంజూరు చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ ఎక్స్ లో పోస్టు చేశారు. మచిలీపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారి వరకూ ఈ ఆరు లేన్ల రహదారి నిర్మాణం కానుంది
నిధులు మంజూరు...
ఇందుకోసం దాదాపు 577 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పోర్టు నుంచి నేరుగా జాతీయ రహదారికి సులువుగా చేరుకునేందుకు ఈ ఆరు లేన్ల రహదారి ఉపయోగపడుతుంది. జాతీయ రహదారి - 65, జాతీయ రహదారి -16 కు అనుసంధానం చేస్తూ ఈ ఆరులేన్ల రహదారిని నిర్మించనున్నారు. మచిలీపట్నం బైపాస్ మీదుగా ఈ రహదారి నిర్మాణం జరగనుంది. పోర్టు నుంచి నేరుగా హైవే కారిడార్ కు కనెక్ట్ చేయడంతో అనేక సమస్యలు తగ్గడమే కాకుండా వేగంగా సరుకు రవాణా జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ రహదారిలో సర్వీస్ రోడ్లతో పాటు మూడు ఫ్లైఓవర్లు, ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి కూడా ఉంటుందని గడ్కరీ తెలిపారు.