వైరల్ అవుతున్న పవన్ ట్వీట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ యుద్ధం పై చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ యుద్ధం పై చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. యుద్ధం చేయాల్సి వస్తే తాను 99 సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తానని చెప్పారు. మార్పు కోసం నూరోసారి మాత్రమే యుద్ధం చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఏకపక్షంగా రష్యా దాడులు చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
ఎవరిని ఉద్దేశించి?
దీంతో పవన్ ట్వీట్ రష్యాను చేసి ఉద్దేశించిందా? లేక ఇటీవల విడుదలయిన తన మూవీ భీమ్లా నాయక్ సినిమాకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడంపై ఈ ట్వీట్ చేశారా? అన్నది చర్చగా మారింది. సినిమా టిక్కెట్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని పవన్ ప్రశ్నించారా? అన్న వాదన కూడా ఉంది. ఏపీ ప్రభుత్వంపై యుద్ధానికి ఇంకా తనకు సమయం ఉందని పరోక్షంగా పవన్ చెప్పారంటున్నారు ఆయన అభిమానులు.