జగన్ కు కౌంటర్ ఇచ్చిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ కు కౌంటర్ ఇచ్చారు

Update: 2022-02-10 02:15 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. తనను చంద్రబాబు దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించిన జగన్ వ్యాఖ్యలను పవన్ కొట్టిపారేశారు. తాను ప్రజల దత్తపుత్రుడిని అని పవన్ చెప్పారు. పీఆర్సీ విషయంలో మంత్రులే ఉద్యోగులను రెచ్చగొట్టారని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం అందరినీ శత్రువులుగా చూస్తుందని అన్నారు. జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీపీఎస్ రద్దు...
పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు సంతృప్తికరంగా లేరని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తే తనపై మాటల దాడి చేయడమేంటని పవన్ ప్రశ్నించారు. పాదయాత్రలో సీపీఎస్ ను రద్దు చేస్తానని ఆయనే మాట ఇచ్చారని, ఇప్పుడు మాట నిలబెట్టుకోమని కోరడం తప్పెలా అవుతుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
వాళ్లు రోడ్ల మీదకు వస్తే....
లక్షలాది మంది ఉద్యోగులు కడుపు మండి రోడ్డు మీదకు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఆధిపత్య ధోరణి అన్న తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ పదం ఎందుకో సజ్జలగారికి నచ్చనట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. పీఆర్సీ సమస్య తాము సృష్టించింది కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.


Tags:    

Similar News