Ys Jagan : జగన్ .. బయటకు వచ్చేది అందుకేనా? గ్యాప్ తొలగించేందుకు ప్రయత్నించరా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేవలం పరామర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు.

Update: 2026-02-06 08:53 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేవలం పరామర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇప్పటికే రెండేళ్ల కాలం పూర్తయింది. దీంతో పరామర్శలు ఆపేసి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. వైసీపీ గత ఎన్నికల్లో కేవలం పదకొండు నియోజకవర్గాల్లోనే గెలిచింది. మిగిలిన 164 నియోజకవర్గాల్లో పార్టీ ఆశించినంత మాత్రం బాగా లేదు. అక్కడ క్యాడర్ కు, నేతలకు మధ్య గ్యాప్ పెరిగింది. రెండేళ్లవుతున్నా నేతలు కొందరు కార్యకర్తలను దగ్గరకు తీసుకోవడం లేదు. దీంతో జగన్ జిల్లాల పర్యటన చేయాలంటున్నారు. పాదయాత్ర సంగతి తర్వాత.. అది ఏడాదిన్నర తర్వాత కాని మొదలు కాదు. కానీ ఈలోపు పార్టీలోని క్యాడర్ ను, లీడర్ ను యాక్టివ్ చేయాలంటే ఖచ్చితంగా జిల్లాలకు వెళ్లి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయాలని నేతలు కోరుతున్నారు.

ఒకటి రెండు జిల్లాల్లో...
ఇప్పటికీ రాయలసీమలోని ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పార్టీ యాక్టివ్ గా లేదు. జగన్ బయటకు వచ్చినప్పుడు మాత్రం కార్యకర్తలు అభిమానంతో వచ్చి జగన్ కు స్వాగతం చెబుతున్నారు. జగన్ ను చూసేందుకు పోటీ పడుతున్నారు. కానీ చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడలేదన్నది చాలా మంది బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ పదవులను పూర్తిగా చేపట్టలేదు. బూత్ లెవెల్ కమిటీల నియామకం చాలా చోట్ల జరగకపోవడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. పాత నేతలే తిరిగి పోటీ చేస్తారన్న భావనతో కొత్త వారు నియోజకవర్గంలో నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు ముందుకు రావడం లేదని గట్టిగా పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం....
ద్వితీయ శ్రేణి నేతలు కొంత గట్టిగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం అప్పుడే ఎందుకన్నట్లు కొంత ఇంకా ఆలోచనలో ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయానికి బయటకు వచ్చి యాక్టివ్ అయితే బాగుంటుందని వారి వ్యాపారాలు, మిగిలిన వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగిపోయారు. 175 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో గెలిచిన 151 మందిలో పది నుంచి పదిహేను మందికి మించి యాక్టివ్ గా లేరు. ఇది నిజం. పరామర్శ చేయవచ్చు. తప్పులేదు. కానీ అదే సమయంలో జగన్ జిల్లాలకు వచ్చి కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. అప్పుడే వచ్చే ఎన్నికలకు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల సమాయానికి కానీ పార్టీ పుంజుకోదని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఇప్పట్లో జిల్లాల పర్యటన చేసే అవకాశాలు కనిపించడం లేదు.


Tags:    

Similar News