జగన్ మరో అంశంలో వెనక్కి...?

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనుంది.

Update: 2021-11-23 02:28 GMT

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనుంది. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గిన జగన్ ప్రభుత్వం శాసనమండలి విషయంలోనూ పునరాలోచనలో పడ్డారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మరో సారి తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

కేంద్రానికి...
శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు వీగిపోవడంతో గత ఏడాది జనవరిలో శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. పెద్దల సభతో ఉపయోగం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీకి శాసనమండలిలో బలం రావడంతో ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.


Tags:    

Similar News