Attack On Ys Jagan : దుర్గారావు రాయి గురి జగన్ కు కాదా? పోలీసుల విచారణలో మరో కోణం?

వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.

Update: 2024-04-19 05:36 GMT

వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. పోలీసులు నాలుగు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఏ1 గా ఉన్న సతీష్ ను నిన్న కోర్టులో హాజరుపర్చగా పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. అయితే సతీష్ ను విచారణ చేస్తున్నప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సతీష్ అనేక ఆసక్తికరమైన విషయాలను పోలీసు విచారణలో బయటపెట్టాడు. అయితే జగన్ ను హత్య చేయడానికే ఈ రాయి దాడి జరిగిందని చెబుతున్నప్పటికీ అసలు టార్గెట్ వేరేనని కూడా మరోకోణంలోనూ విచారణ చేపట్టారు.

స్కెచ్ దుర్గారావుదే కానీ...?
ఈ విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొన్నారు. సతీష్ చేత రాయి దాడి చేయించింది దుర్గారావు అని విచారణలో వెల్లడయింది. ఇందుకు కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తానని చెప్పడంతో సతీష్ రాయి విసిరినట్లు విచారణలో స్పష‌్టం చేసినట్లు తెలిసింది. అందుకే రెండుసార్లు రాయి దాడి చేశానని సతీష్ చెబుతున్నాడు. మొదట డాబా కొట్టు సెంటర్ లో రాయి దాడి చేసినా అది తగలకుండా పోవడంతో తర్వాత వివేకానంద స్కూలు వద్ద రాయి విసిరానని సతీష్ విచారణలో వెల్లడించాడు. కానీ ఆ తర్వాత దుర్గారావుకు ఫోన్ చేస్తే మొదటి సారి స్పందించలేదని, రెండోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని సతీష్ విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు.
మరో కోణం...
ిఇప్పటి వరకూ జగన్ టార్గెట్ గానే ఈ దాడి జరిగిందని భావించినా ఇందులో మరో కోణం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అసలు టార్గెట్ జగన్ కాదని.. వెల్లంపల్లి శ్రీనివాస్ అని అంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిటేట్లు రాయి విసరాలని దుర్గారావు జగన్ తో చెప్పాడంటూ పోలీసుల విచారణలో స్పష్టమయిందంటున్నారు. అయితే అది గురి తప్పి జగన్ కు తగిలి ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా తగిలందని భావిస్తున్నారు. ఈ కోణంలోనూ దుర్గారావును విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ2 గా దుర్గారావును నేడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిసింది. దుర్గారావు వెల్లంపల్లి శ్రీనివాస్ ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే తాను రాయి విసరాలని సతీష్ తో చెప్పినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.


Tags:    

Similar News