ఏపీలో దంచి కొడుతున్న వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి

Update: 2022-09-10 03:48 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్సాలకకు కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సింగంపల్లిలోని ప్రధాన రహదారిపై నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

రాయలసీమలోనూ...
గుంటూరు జిల్లాలోనూ వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక పట్ణణాల్లో డ్రైనేజీలు పొంగి దుర్వాసన వెదజల్లుతుంది. అనంతపురం జిల్లాలోనూ వర్షాలు ురుస్తుననాయి. చెరువులన్నీ నిండి పోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి.


Tags:    

Similar News