ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీ అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై రేపు ప్రభుత్వం వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-09-07 06:52 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై రేపు ప్రభుత్వం వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. అయితే రేపు దీనిపై విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్వర్వులపై స్టే ఇవ్వాలని, ఇవాళ అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించినట్లు సమాచారం.

రేపు విచారణ...
నిన్న ఏసీబీ కోర్టు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మూడు గంటల పాటు ఆలస్యంగా అమలు చేశారంటూ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై హైకోర్టులో రెండు పిటీషన్లపై విచారణ జరగనుంది. ఈరోజు పది గంటల ప్రాంతంలో విజయవాడ జిల్లా జైలు నుంచి ముగ్గురు నిందితులు విడుదలయ్యారు.


Tags:    

Similar News