Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు

Update: 2025-12-05 05:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులందరూ గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరంతా శబరిమల వెళ్లేందుకు ఇరుముడి కట్టుకునేందుకు ఒంగోలుకు వెళుతున్నారు.

అయ్యప్ప మాల వేసుకుని...
ఈ సమయంలో గణపవరం బైపాస్ రోడ్డులో ముందుగా వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. దీంతో అక్కడికక్కడే నలుగురు విద్యార్థులు చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొక ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించార. మృతులను రామిరెడ్డి, శ్రీకాంత్, మహేష్, కార్తీక్, వాసు గా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News