టీటీడీ కీలక నిర్ణయం...బ్రేక్ దర్శనాలపై సిఫార్సు లేఖలు రద్దు
తిరుమలలో బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది
తిరుమలలో బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాలపై సిఫార్సు లేఖల స్వీకరణ కొన్ని పర్వదినాల్లో రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వచ్చే సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.
ఈ తేదీల్లో రద్దు చేస్తూ...
వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీలను కూడా టీటీడీ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి జనవరి నెలాఖరు వరకు పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన ట్లు టీటీడీ చెప్పింది. డిసెంబర్ 23 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29 న, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠద్వార దర్శనాలు, జనవరి 25 న రథసప్తమి దృష్ట్యా ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని, వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.