Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-12-05 05:48 GMT

డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది. డ్వాక్రా మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన చేకూరే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డ్వాక్రా మహిళలు అదనపు ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు.

కూరగాయలు సాగు చేసి...
ఇకపై పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీలకు కావాల్సిన కూరగాయలను డ్వాక్రా మహిళలే సాగు చేసి నేరుగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూరగాయలు వారే పండించి వాటిని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ కు, అంగన్ వాడీలకు అందిస్తే ఇటు వారికి ఆర్థిక ప్రయోజనంతో పాటు నాణ్యమైన కూరలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపింద.ి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమయింది.



Tags:    

Similar News