మోడల్ స్కూల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు

Update: 2025-12-05 07:54 GMT

శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వెంట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని భామినిలోని ఏపీ మోడల్ స్కూల్ కు వచ్చిన చంద్రబాబు, లోకేశ్ లకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు.

తరగతి గదిలో కూర్చుని...
ఒక తరగతి గదిలో కూర్చుని విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలను, క్రీడా ప్రాంగణం వంటి విషయాలను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. తరగతి లో బోధన, ఇతర విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణం మొత్తం పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రశ్నలను అడిగారు.


Tags:    

Similar News