Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రంలో చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఏపీ మోడల్ స్కూల్ లోని మెగా పేరెంట్స్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొననున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మెగా పేరెంట్స్ మీటింగ్ లో...
వారి చదువులు సాగుతున్న తీరును పరిశీలిస్తారు. అనంతరం పాఠశాలలో వసతి సదుపాయాలు, విద్య వంటి వాటిపై విద్యార్థుల తల్లిదండ్రులతో చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం పాఠశాలలో సమస్యలు, విద్యార్థులకు అందిస్తున్న బోధన వంటి అంశాలపై చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి అక్కడి విషయాలు అడిగి తెలుసుకుంటారు.