Midhun Reddy : మిధున్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కి హైకోర్టు షాకిచ్చింది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కి హైకోర్టు షాకిచ్చింది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. మద్యం స్కామ్ కేసులో మిధున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మిధున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిధున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
బెయిల్ పిటీషన్ ను...
దీనిపై విచారించిన హైకోర్టు మద్యం స్కామ్ కేసులో మిధున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. దీంతో మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ ప్రభుత్వం, ఆయన తరుపున వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో తిరిగి మిధున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నారు. మరొక వైపు మిధున్ రెడ్డిని మరోసారి విచారణకు పిలిచి అదుపులోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తారన్న ప్రచారం జరుగుతుంది.