Kurnool : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయి
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. పదిహేను మంది న్యాయమూర్తులకు అవసరమైన సౌకర్యాలను సంబంధించి పూర్తి వివరాలను సంబంధించాలని హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలు జిల్లా కలెక్టర్ ను కోరారు. కోర్టు కాంప్లెక్స్ తో పాటు న్యాయస్థానం గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులకు, కోర్టు సిబ్బందికి నివాస వసతికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని కోరారు.
తాత్కాలిక భవనాల కోసం...
రిజిస్ట్రార్ లేఖపై వెంటనే జిల్లా కలెక్టర్ కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కర్నూలులో తాత్కాలిక హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలతో పాటు భవనాలను కూడా చూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్వరలోనే హైకోర్టు రిజిస్ట్రార్ కు నివేదిక ఇవ్వాలని కోరడంతో ఆర్ అండ్ బి సిబ్బంది కర్నూలు హైకోర్టు బెంచ్ కు అవసరమైన భవనాలను వెదికే పనిలో పడ్డారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ఒక కమిటీని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వేగంగా అడుగులు పడుతున్నాయి.