హైవేకు కాసు బ్రహ్మానందరెడ్డి పేరు

అద్దంకి - నార్కేట్‌‌పల్లి జాతీయ రహదారికి కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వే గా ప్రభుత్వం నామకరణం చేసింది.

Update: 2023-02-24 06:05 GMT

అద్దంకి - నార్కేట్‌‌పల్లి జాతీయ రహదారికి కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వే గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఏపీ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులతో పాటు అనేక అభివృద్ధికి పాటుపడిన కాసు బ్రహ్మానందరెడ్డి పేరును జాతీయ రహదారికి పెట్టారు.

అద్దంకి - నార్కేట్‌పల్లి రోడ్డును...
ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచేందుకు ఈ పేరును ప్రభుత్వం పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలో ఉన్న అద్దంకి - నార్కేట్ పల్లి జాతీయ రహదారిని ఇక కాసు బ్రహ్మానందరెడ్డి హైవేగా పిలువనున్నారు.


Tags:    

Similar News