జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరిగాయో ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2022-01-23 01:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరిగాయో ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాలంటీర్లను ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పీఆర్సీ తో ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరిగాయో పట్టిక రూపంలో వాలంటీర్లకు పంపింది.

వాలంటీర్ల ద్వారా....
ప్రతి వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న యాభై ఇళ్లకు వెళ్లి ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరిగాయో వివరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, జీతాలు పెరిగినా ఆందోళనకు దిగుతున్నారని, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతభత్యాలను పెంచలేమని జగన్ ప్రభుత్వం వివరించనుంది. ప్రజల నుంచి ఉద్యోగులపై వత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Tags:    

Similar News