Pawan Kalyan : నేడు అధికారులతో పవన్ మాటామంతీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు

Update: 2025-12-10 03:09 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. వారితో మాటా మంతీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ ఉదయం పదిన్నర గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పంచాయతీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు.

గ్రామాల్లో సమస్యలపై...
ప్రధానంగా తాగు నీరు, రహదారులు, వీధిలైట్లు, చెరువుల పునరుద్ధరణ, సాగునీరు, పల్లెల్లో మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహాకారం ఏ రకంగా ఉండాలన్న దానిపై కూడకా పవన్ కల్యాణ్ చర్చించనున్నార. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలోని రావి వలస గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.


Tags:    

Similar News