Andhra Pradesh : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అన్ని సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పంది. పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
పదోన్నతులతో పాటు...
ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మూడంచెల వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా సచివాలయం లో ఉన్న ఉద్యోగులతో ఇతర శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులతో పాటు ఇతర శాఖల పనులను కూడా అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.